1,376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరిల్లో 1,376 పారా-మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఇలా వివిధ కేటగిరీల్లో పోస్టులు ఉన్నట్లు తెలిపింది. ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ చేసిన వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వెబ్సైట్: https://indianrailways.gov.in/