అరుదైన బ్లాక్ డైమండ్ యాపిల్ గురించి మీకు తెలుసా?
సాధారణంగా యాపిల్స్ ఎరుపు, పచ్చ రంగులలో ఉండటం మనం చూసి ఉంటాం. కానీ బ్లాక్ యాపిల్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా. అవును ఈ రకమైన యాపిల్ పండ్లు కూడా ఉన్నాయి. యాపిల్ జాతుల్లోనే ఈ పండుకు ప్రత్యేకత ఉంది. ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని న్యింగ్చీ పర్వత సానువుల్లో మాత్రమే పండుతాయి. వీటి ధర కూడా ఎక్కువే. ఒక్కో పండు ధర రూ.500 వరకు ఉంటుంది. అందుకే దీన్ని ‘బ్లాక్ డైమండ్ యాపిల్’ అని పిలుస్తారు. ఈ పండు రుచికి పుల్లగా తియ్యగా ఉంటుందట.