రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు
దేశంలో 2023-24 పంటల సీజన్లో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. మొత్తం 332.22 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. 2022-23తో పోలిస్తే 2.61 మిలియన్ టన్నులు అధికం అని వివరించింది. అత్యధికంగా వరి 137.82 మిలియన్ టన్నులు, గోధుమ 113.29 మిలియన్ టన్నులు దిగుబడులు వచ్చినట్లు పేర్కొంది.