కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు (Video)
మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు కాడెడ్లుగా మారారు. స్వయంగా ట్రాన్స్ఫార్మర్ని ఎడ్ల బండిపై చేర్చి ఎద్దుల స్థానంలో రైతులే బండిని లాగుతూ ట్రాన్స్ఫార్మర్ని అమర్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.