ఎన్నికల విధుల్లో 33మంది సిబ్బంది మృతి.. కారణం అదే

67చూసినవారు
ఎన్నికల విధుల్లో 33మంది సిబ్బంది మృతి.. కారణం అదే
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలు నిర్వహించడంతో పలు చోట్ల సిబ్బందితోపాటు, ఓటర్లు కూడా మృత్యువాత పడ్డారు. ఈ మేరకు అత్యధిక వేడి కారణంగా ఉత్తరప్రదేశ్లో 33 మంది ఎన్నికల సిబ్బంది మరణించారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా తెలిపారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఏడో విడత పోలింగ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాలకు శనివారం ఎన్నికలు జరిగాయి.

సంబంధిత పోస్ట్