ర్యాష్ డ్రైవింగ్ కేసు.. మద్యం తాగి నడిపినట్లు ఒప్పుకున్న మైనర్

55చూసినవారు
ర్యాష్ డ్రైవింగ్ కేసు.. మద్యం తాగి నడిపినట్లు ఒప్పుకున్న మైనర్
పూణేలో పోర్ష్ కార్ యాక్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మైనర్ నిందితుడు వేగంగా కారు నడిపి ఇద్దరు ఐటీ నిపుణుల మరణానికి కారణమయ్యాడు. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి బాగా తాగి ఉన్నట్లు మైనర్ ఒప్పుకున్నాడని పోలీస్ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మేరకు తనకు ఆరోజు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా గుర్తుకు రాలేదని అధికారులకు తెలిపినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్