అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూ.వెయ్యి కోట్ల ‘వెంచర్ క్యాపిటల్ ఫండ్’ ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 40 స్టార్టప్‌లకు మద్దతు, అంతరిక్ష సంబంధిత పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి చేయూత లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అంతరిక్ష సాంకేతికతలో ముందడుగు వేసి, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశం రాణించడానికి అవకాశం ఉంటుందని తెలిపింది.