శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ప్రతి ఏడాది రాముల వారి శోభాయాత్ర చేస్తారు. అందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మంగళ్‌హాట్ పరిధి సీతారాంభాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 20 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.