కెనడా పార్లమెంట్‌కు అధికారులు తాళాలు వేశారు. శాంతి భద్రతల నేపథ్యంలో భాగంగా పార్లమెంట్‌ను మూసి వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఓ దుండగుడు శనివారం రాత్రి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించి అక్కడే నిద్రపోయాడు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో లాక్‌డౌన్ విధించి దుండగుడిని అరెస్ట్ చేశారు. అయితే అతను లోపల ఏమైనా పేలుడు సామగ్రి ఉంచాడా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.