ఢిల్లీలోని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 345 వాహనాలు దగ్ధమయ్యాయి. ఆదివారం వాహనాలు పార్క్ చేసి ఉన్న స్టోర్ హౌస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ పూర్తిగా వ్యాపించింది. అక్కడున్న అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలు అదుపుచేశారు. గతంలోనూ అక్కడ ప్రమాదం జరగడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.