బెంగళూరులోని ఓ వీధిలో యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి తన స్నేహితురాలితో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. లైంగిక దాడి దృశ్యాలు అక్కడున్న ఓ సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.