స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి
ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్ గురుకుల కళాశాలలో ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ విశ్వేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీలో 20 సీట్లు, సీఈసీలో 16 సీట్లు, ఎంపీసీలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన వారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు మూడు జిరాక్స్ సెట్లతో ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.