BSNL తన యూజర్లను పెంచుకునేందుక మరో అదిరిపోయే సూపర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.దేశంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ క్రమంలో ఐపీఎల్ అభిమానుల కోసం రూ.251 రీఛార్జ్‌తో ప్రత్యేక ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను తీసుకుంటే 251 జీబీ డేటా లభిస్తుంది. అలాగే దీని కాలపరిమితి 60 రోజులు ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి కాలింగ్ సదుపాయం ఉండదని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.