తొలి మ్యాచ్‌లో RRపై 286 కొట్టిన SRH 300 పరుగులు కొడుతుందని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. మళ్లీ 200 పరుగుల మార్కునే అందుకోలేదు. LSG, DC చేతిలో పరాజయాలతో ఉసూరుమనిపించింది. KKRతో జరిగిన గత మ్యాచ్‌లో SRH 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 120కే కుప్పకూలింది. నాలుగు మ్యాచుల్లో ఒకటి నెగ్గి, మూడు మ్యాచుల్లో ఓడింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. టాప్ బ్యాటర్లు తమ బ్యాట్‌ను ఝుళిపించకపోతే SRH మనుగడ కష్టమే.