భార్యపై అనుమానంతో నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త

85చూసినవారు
భార్యపై అనుమానంతో నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త
బెంగుళూరులో దారుణం జరిగింది. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లిలో కృష్ణప్ప(43), శారద(35) అనే భార్యాభర్తలిద్దరూ నివాసం ఉంటున్నారు. శారద పలు ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తుండేది. ఈ క్రమంలో భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో.. పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో కృష్ణప్ప శారదను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అతడు పారిపోతుండగా.. స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్