త్వరలోనే వస్తాను.. ఎవ్వరినీ వదిలి పెట్టను: అఘోరీ

66చూసినవారు
త్వరలోనే వస్తాను.. ఎవ్వరినీ వదిలి పెట్టను: అఘోరీ
AP: అఘోరీకి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని వర్షిణీ పేరెంట్స్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అఘోరీ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఆరోపణలపై తాను క్లారిటీ ఇస్తానని.. తన బ్యాంక్ స్టేట్‌మెంట్ సైతం చూపిస్తానంటూ అఘోరీ ఓ వీడియో రిలీజ్ చేసింది. 'ప్రస్తుతం నేను కాశీలో ఉన్నాను. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రాకు వస్తాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఎవ్వరినీ వదిలి పెట్టను' అని తెలిపింది.

సంబంధిత పోస్ట్