ప్రముఖ అమెజాన్ సంస్థ సీఈఓ ఆండీ జస్సీ మేనేజర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యలో ఉండే మేనేజర్లు ప్రతి దాంట్లో వేలు పెట్టాలని చూస్తారని, వారి ప్రమేయాన్ని తగ్గిస్తామని అన్నారు. అంచెలంచెలుగా ఉద్యోగులు ఉండటంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జస్సీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.