భారత్‌పై సుంకాల మోత.. ట్రంప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

60చూసినవారు
భారత్‌పై సుంకాల మోత.. ట్రంప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నింటికి సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్‌ పాలన సాగుతోంది. అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుంది. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, అవి పారదర్శకంగా ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్