భారత్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (అమ్కా)ని తొలిసారి ‘ఏరో ఇండియా-2025’లో ప్రపంచానికి చూపించబోతున్నారు. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తాను స్వంతంగా పనిచేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది.