జగన్ హయాంలో ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు దాటిందని చంద్రబాబుప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ ఆరోపించింది. "జగన్ హయాంలో 2019-24 వరకు ఏపీ అప్పు రూ.2.57 లక్షల కోట్ల నుంచి రూ.4.91 లక్షల కోట్లకి పెరిగినట్లు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల చెప్పారు. మరి ఆ అప్పు రూ.10 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేసినందుకు లెంపలేసుకుని ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్తావా చంద్రబాబు?" అని శుక్రవారం ఎక్స్ వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది.