ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ను సొంతం చేసుకున్నప్పటి నుంచి బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కేవలం సమాచారం పంచుకోవడానికి మాత్రమే ఉపయోగించిన యాప్‌ను ఇప్పుడు ఆల్-ఇన్-వన్ యాప్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పేమెంట్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఎక్స్‌లో రానున్న ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.