తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'రాజీవ్ యువ వికాసం' పథకం దరఖాస్తులపై బీసీ కార్పొరేషన్ స్పష్టత ఇచ్చింది. ఈ పథకం పొందేందుకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు వెల్లడించారు. 2016 తర్వాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం ఉంటే చాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.