తెలంగాణలో సోమవారం, మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. సోమవారం ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మంగళవారం సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.