రైతులకు బిగ్ రిలీఫ్.. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం!

50చూసినవారు
రైతులకు బిగ్ రిలీఫ్.. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం!
TG: రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటడం, నీటి కొరత నేపథ్యంలో పలు చోట్ల వరి పంట ఎండిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పంటల వివరాలు సేకరించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామాలు, క్లస్టర్లవారీగా ఎండుతున్న పంటల వివరాలు సేకరించాలని మండలాధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్