TG: కృష్ణా, గోదావరి జలాలపై విచారణకు బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై న్యాయవాదులు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం చర్చలు జరిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న విచారణ అంశాలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు.