పెళ్లయిన ఏడాదికి భర్తపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన కర్ణాటకలోని బట్లపల్లిలో చోటు చేసుకుంది. ఓబులాపురానికి చెందిన లలితకు తల్లిదండ్రులు లేరు. 17ఏళ్ల వయసులో గుడిపల్లికి చెందిన మల్లి కార్జున(35)ను వివాహం చేసుకుంది. లలిత గర్భం దాల్చడంతో చింతామణి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. అక్కడ వైద్యులు వయస్సు ఆరా తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో లలిత భర్త మల్లికార్జునపై ఫోక్సో కేసు నమోదైంది. వీరికి ఓ పాప పుట్టింది.