జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందుకే సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది. చికెన్ తినడం వల్ల అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలు వచ్చి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే, జ్వరం సమయంలో చికెన్ తినాలనిపిస్తే.. అది బాగా ఉడికించి, ఉప్పు, కారం తక్కువగా వేసుకుని తీసుకోవాలి.