పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక ప్రకటన చేసింది. తన కస్టమర్లకు KYC అప్‌డేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. 31 మార్చి 2025 నాటికి KYC అప్‌డేట్ చేయని ఖాతాదారులకు ఏప్రిల్ 10 నాటికి తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించింది. KYC చేయకపోతే కస్టమర్లు తమ ఖాతా నుండి ఎటువంటి లావాదేవీలు చేయకుండా బ్యాంక్ ఖాతాపై తాత్కాలిక నిషేధం విధించబడుతుందని వెల్లడించింది. దీని వల్ల మీరు డబ్బు జమ చేయలేరు, అలాగే ఉపసంహరించుకోలేరు.