టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల నుంచి మొదట 8 మందిని బయటకు తీశామని, వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఇస్తాంబుల్ గవర్నర్ దావత్ గుల్ వెల్లడించారు. కూలిన భవనం 38 ఏళ్ల నాటిదని, భవనం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.