నటి శ్రీలీలకు ఊహించని షాక్ ఎదురైంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఫ్యాన్స్ మధ్య నుంచి హీరోతో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఓ అభిమానికి ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వగా, తనవైపు లాక్కొన్నాడు. వెంటనే పక్కనే ఉన్నవారు శ్రీలీలను బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.