కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్‌ఖాన్, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీలో ఓ ఇంట్రస్టింగ్ వార్త ఏంటంటే.. పోలీస్ గెటప్ కోసం విజయశాంతి ఏకంగా పది కేజీల బరువు తగ్గారట. మళ్లీ డైరెక్టర్ పెరగమన్నారని కాస్త బరువు పెరిగా అని ఓ ఇంటర్వూలో విజయశాంతి చెప్పుకొచ్చారు.