నీట్ వివాదంలో కేంద్రం కీలక నిర్ణయం

70చూసినవారు
నీట్ వివాదంలో కేంద్రం కీలక నిర్ణయం
నీట్‌- యూజీ 2024 గ్రేస్ మార్కుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ ఫలితాల్లో 1563 మంది విద్యార్థులకు అదనంగా ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వారందరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. 1563 మందికి జూన్‌ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి ఈ నెల 30లోగా ఫలితాలను ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంది. వారికి ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుందని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్