TG: పెళ్లి వేడుకల్లో మద్యం తాగిన గొడవకు దిగిన వ్యక్తిపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. అక్కడ మాగి రాములు (45) అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి గాలిపూర్ గ్రామానికి వెళ్లాడు. గొడవ తీవ్రం కావడంతో అక్కడికి వచ్చిన వారు అతడిపై దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.