తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్నిసీఎం రేవంత్ ప్రారంభించారు. SC,ST, BC, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రాయితీ రుణాలు ఇవ్వనుండగా.. ఒక్కో లబ్దిదారునికి రూ.4 లక్షల వరకు మంజూరు కానుంది. 60-80% వరకు రాయితీతో రుణాలు ఇవ్వనున్న ఈ పథకానికి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలన, జూన్ 2న రాయితీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది.