సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యక్తిగత పనుల నిమిత్తం మొదటి రోజు జైపూర్ కు వెళ్లనున్నారు. అనంతరం 2 రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏఐసీసీ పెద్దలను కలిసి సీఎం చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యనేతలు ఉండనున్నారు.