ప్రధాని కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌ గైర్హాజరు.. కారణమిదే

76చూసినవారు
ప్రధాని కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌ గైర్హాజరు.. కారణమిదే
తమిళనాడులోని రామేశ్వరంలో నూతనంగా నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ గైర్హాజరు అయ్యారు. స్టాలిన్ ఈ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి కారణం డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడమే కారణంగా తెలుస్తోంది. కాగా డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్టాలిన్ మొదటి నుంచి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్