అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం ప్రముఖ MNC కంపెనీ ‘కాగ్నిజెంట్' ప్రతినిధులతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆ కంపెనీ సీఈవో రవికుమార్ Xలో స్పందించారు. 'న్యూ యార్క్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యా. బెస్ట్ ఐటీ హబ్ లలో ఒకటైన హైదరాబాద్ లో కంపెనీని అధునాతన మౌలిక సదుపాయాలతో విస్తరిస్తాం. దీనిద్వారా 15వేల ఉద్యోగాలు కల్పిస్తాం' అని ట్వీట్ చేశారు.