తెలంగాణలో త్వరలో కామన్ రెవెన్యూ కోడ్?

78చూసినవారు
తెలంగాణలో త్వరలో కామన్ రెవెన్యూ కోడ్?
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తేవాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే చట్టంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించాలని, పక్కా విస్తీర్ణంతో పాస్ బుక్ లు జారీ చేయాలని చెబుతోంది. వీటితో పాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.

సంబంధిత పోస్ట్