శృంగారానికి నిరాకరించాడని భర్తపై ఫిర్యాదు

1899చూసినవారు
శృంగారానికి నిరాకరించాడని భర్తపై ఫిర్యాదు
బీహార్‌ వైశాలి జిల్లా లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన కేసు నమోదైంది. తన భర్త శృంగారానికి నిరాకరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనకు 2021 మే 31న వివాహం జరిగిందని, పెళ్లయ్యాక రెండేళ్ల వరకు భర్త తనతో శారీరక సంబంధానికి నిరాకరించాడని పేర్కొంది. అత్తమామలకు ఈ విషయం చెబితే వారు తనను దుర్భాషలాడారని వాపోయింది. చివరికి తాను తండ్రి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్