తెలంగాణలో కులగణనను అశాస్త్రీయ పద్దతిలో చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేసేలా ఉన్న కులగణనను వెంటనే సరిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో సీఎస్‌ను బీఆర్ఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపరిచిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.