యూపీలోని పిలిభిత్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక పాడుబడిన బావిలోంచి నీటితోపాటు కరెన్సీ నోట్లు వెలువడిన ఉదంతం వెలుగు చూసింది. పిలిభిత్‌లోని మొహల్లా గ్యాస్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని ఓ పాత బావిలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు కనిపించాయి. దీంతో ఆ బావిలోని నోట్లను బయటకు తీశారు. అయితే వారికి నిరాశే మిగిలింది. ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉండటంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.