హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSతో ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ దాఖలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ 'X' వేదికగా ఆరోపించారు. 'ఈ ఎన్నికల్లో 112 ఓట్లు ఉన్నాయి. ఇందులో BJP-27, BRS-23, MIMకు 49 ఉన్నాయి. మాకు 13 మాత్రమే ఉండటంతో పోటీ చేయలేదు. బలం లేని బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి BRSకు బినామీగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రజల్లో ఉంది' పేర్కొన్నారు.