ప్రముఖ యూట్యూబర్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

56చూసినవారు
ప్రముఖ యూట్యూబర్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీకి ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఆయనపై బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ కరంషి నఖువా పరువు నష్టం దావా వేశారు. రూ. 20 లక్షల నష్టపరిహారం కోరారు. తనకు వ్యతిరేకంగా ధ్రువ్ రాథే సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో తనను సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్ చేశారని వాపోయాడు. ఈ కేసు విచారణను ఆగస్టు 6కు కోర్టు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్