పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో ఆదివాసీ తెగకు చెందిన శాంతి టిగ్గాకు బాల్యంలోనే వివాహమైంది. భారత ఆర్మీలో చేరి, సైన్య దుస్తులు ధరించాలనేది ఆమె కల. సాయుధ దళాల రిక్రూట్మెంట్ శిక్షణలో రాణించింది. 1.5 కి.మీ పరుగును ఐదు సెకన్ల వేగంతో, 50 మీటర్ల పరుగును 12 సెకన్లలో పూర్తి చేసి పలువురి మన్ననలు పొందారు. ఉత్తమ ట్రైనీ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె అసాధారణ విజయాలకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ టిగ్గాను సత్కరించారు.