TG: శోభాయాత్ర నిర్వాహకులతో హైదరాబాద్ పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని CP CV ఆనంద్ సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా నిర్వహకులు చూడాలన్నారు. శోభాయాత్రలో డ్రోన్లు వాడొద్దని, డీజేల వినియోగం వల్ల ప్రజలకు ఇబ్బందులు పడతారని సూచించారు. శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామనివి స్పష్టం చేశారు.