బీఆర్ఎస్‌ రజతోత్సవ సభపై సందిగ్ధత!

65చూసినవారు
బీఆర్ఎస్‌ రజతోత్సవ సభపై సందిగ్ధత!
TG: ఈనెల 27వ తేదీన హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ హై కమాండ్ ప్లాన్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ సైతం పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6 నుంచి 30 రోజులపాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుంది. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. దీంతో సభకు సిటీపోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారిందని చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్