బీజేపీ అధ్యక్ష పదవి మార్పుపై పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. తమ పార్టీలో అధ్యక్షులు పదేళ్లు, ఇరవై ఏళ్లు వారసత్వంగా ఉండరని చెప్పారు. తమ ఢిల్లీ నాయకత్వం అంతా సమగ్రమైన ఆలోచనతో ఉన్నారని అన్నారు. HYD-కంటోన్మెంట్ లో జెండా పండుగ నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు సాధించి సగం ఎంపీ సీట్లు గెలుచుకుని.. రేపటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ప్రజలు ముందే మెసేజ్ అందించారని చెప్పారు.