రెస్టారెంట్‌లో కుర్చీ కోసం కొట్లాట.. వీడియో వైరల్‌

59చూసినవారు
ఓ రెస్టారెంట్‌లో కుర్చీ కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. ఖయాబాన్-ఎ-సహర్‌లోని ఒక రెస్టారెంట్‌లో రెండు కుటుంబాల వారు పక్కపక్కనే కూర్చున్నారు. వారిలో కొందరు నిలబడ్డారు. అయితే కొందరు మహిళలు లేవడంతో ఖాళీ అయిన కుర్చీని ఒక మహిళ తీసుకుంది. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. చివరికి రెస్టారెంట్‌ సిబ్బంది, పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది.

సంబంధిత పోస్ట్