గెలిచేందుకు నా శాయశక్తులా పోరాడా: లక్ష్యసేన్

81చూసినవారు
గెలిచేందుకు నా శాయశక్తులా పోరాడా: లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తన ఓటమిపై తాజాగా స్పందించారు. 'ఈ ఒలింపిక్స్‌ ప్రయాణం నా గౌరవాన్ని పెంచింది. అలాగే నా హృదయాన్ని ముక్కలు చేసింది. గెలిచేందుకు శాయశక్తులా ప్రతి ఔన్సు బలంతో పోరాడాను. కానీ విజయానికి కాస్త దూరంలో పడిపోయాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' ' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్