మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ శర్మ రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట కూడా విడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. పెళ్లి విషయంలో వారి మధ్య వచ్చిన మనస్పర్థలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని భావిస్తుండగా.. విజయ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని సమాచారం. అలాగే ఆమె నియంత్రించే స్వభావం కారణంగా ఇరువురి మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.